బాలీవుడ్ వధువు.. హాలీవుడ్ వరుడు..

ప్రియాంక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆ తరుణం వచ్చేసింది. బాలీవుడ్ బామ ప్రియాంక చోప్రా.. హలీవుడ్‌ పాప్ సింగర్ నిక్ జొనాస్‌ను వివాహం చేసుకుంది. జోధ్‌పూర్‌లోని చారిత్రక ఉమైద్ ప్యాలెస్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.

ప్రముఖ డిజైనర్‌ రాల్ఫ్‌ లౌరెన్‌ డిజైన్‌ చేసిన గౌనులో ప్రియాంక తళుక్కున మెరిసింది. ఇక హాలీవుడ్ వరుడు నిక్‌ జోనాస్‌, బాలీవుడ్ వధువు ప్రియాంక చేతిని అందుకుని ఉంగరాలు మార్చుకున్నారు. వీరికి అభినందనలు తెలుపుతూ డిజైనర్ రాల్ఫ్ ట్వీట్ చేశారు. దీంతో పలువురు సెలబ్రెటీలతో పాటు నెటిజన్లు ఈ జంటకు విషెష్ తెలుపుతున్నారు. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట మరోసారి వివాహం చేసుకోనున్నట్లు బాలీవుడ్ టాక్.