2.ఓ రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూల్.. ఎంతో తెలిస్తే..

2-0-movie-day-4-collection-rajinikanth-film-heading-towards-rs-400-mark

సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సుప్రీం డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో విజువల్ వండర్ గా తెరకెక్కిన మూవీ 2.ఓ . గతనెల 29న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. మొదటిరోజే 150 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క హిందీ, తమిళ్ లోనే ఈ సినిమా 250 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఆంధ్ర, నైజాం కలిపి 50 కోట్లు పైగానే వసూళ్లు రాబట్టింది. కర్ణాటక, కేరళలో తొలి రోజు షేర్ రూ.8 కోట్లు సాధించింది. రెండో రోజు రూ.4 కోట్లు వసూలు చేసింది. కేరళ విషయానికి వస్తే ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.5.10 కోట్లు షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా విడుదలైన రెండో రోజు ఆశించినంతగా వసూళ్లు రాకపోవడంతో పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా అనే అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మూడో రోజు వసూళ్లు బాగానే ఉండటంతో పాటు నాలుగో రోజు ఆదివారం కూడా కావడంతో భారీ వసూళ్లు సాధించింది. దాంతో 400 కోట్ల క్లబ్ లో చేరింది.