లుంగీతో పరేషాన్ చేస్తోన్న అమలాపాల్

లుంగీ డాన్స్.. లుంగీ డాన్స్ అంటూ లుంగీ కట్టుకుని కుర్రకారును ఊరిస్తున్నారు ముద్దుగుమ్మలు. ఎక్కువగా హీరోలు లుంగీ కట్టుకుని మాస్ ఇమేజ్‌ని ప్రదర్శిస్తుంటారు. మేము మాత్రం తక్కువా అంటూ హీరోయిన్‌లు కూడా లుంగీ కట్టుకుని యూత్‌కి చెమటలు పుట్టిస్తున్నారు.

షారుక్‌తో కలిసి దీపిక పదుకొనే లుంగీ డ్యాన్స్ స్టెప్పులు వేసి.. అభిమానులను ఉర్రూతలాడించారు. టాలీవుడ్ లో కూడా సమంత నుంచి శృతిహాసన్ వరకు లుంగీతో స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌తో వావ్ అనిపించారు. ఇప్పుడు అమలాపాల్ వంతు వచ్చేసింది. లుంగీ కట్టుకుని యూత్‌ని తెగ రెచ్చగొడుతోంది. కాకపోతే ఇది వెండితెరమీద కాదు సోషల్ మీడియాలో.. బ్లూ టీ షర్టు, ఎర్ర లుంగీ కట్టుకున్న ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది అమలాపాల్. ‘వెలకమ్ టూ ద లాండ్ ఆఫ్ లుంగీ’ అంటూ పోస్ట్ కూడా చేసింది. అంతే దీంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. లుంగీ కట్టులో ఉన్న అమ్మడు పరేషాన్ చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.