పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ap-tenth-class-exam-schedule-released-ganta-srinivasa-rao

ఆంధ్రప్రదేశ్‌ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 2019 మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 6.10 లక్షల మంది విద్యార్థులు పదవతరగతి పరీక్ష రాయనున్నట్టు ఆయన తెలిపారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,835 కేంద్రాలను ఏర్పాటు చేస్తునట్టు మంత్రి గంటా వెల్లడించారు. వాటిలో 91 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించామన్నారు.

Also read : వాష్‌రూమ్‌లోకి మొబైల్.. కోరి జబ్బుల్ని..

అలాగే పరీక్షల దరఖాస్తుకు గడువు ఈ నెల 7వ తేదీతో ముగుస్తుందని చెప్పారు. విద్యార్థుల తమ హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పరీక్షలలో ఎటువంటి కాపీయింగ్ కు పాల్పడకుండా 150 ఫ్లైయింగ్‌ స్వ్కాడ్స్‌ను అందుబాటులో ఉంచనున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి ఘంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.