అక్కడ దాడి జరిగితే వారి విచారణ ఎందుకు : జగన్ పై దాడి కేసులో హైకోర్టు..

hicourt hearing on ys jagan attacking case

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ పై దాడి కేసును ఇవాళ విచారించిన హైకోర్టు…ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసును ఎన్‌ఐకేకు ఎందుకు బదిలీ చేయలేదో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సర్కారును ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

Also read : 2.ఓ రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూల్.. ఎంతో తెలిస్తే..

జగన్ పై జరిగిన దాడిపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో విచారణ జరిపించాలని, కేసును ఏపీ పోలీస్ పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. జగన్‌పై జరిగిన దాడికి అన్‌లాఫుల్ ఎగినెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్3(ఏ) కింద కేసు నమోదు చేయాలని, కానీ పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టించేందుకు సెక్షన్ 307 కింద నమోదు చేశారని పిటిషనర్ ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. జగన్‌పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందని, ఎన్ఐఏ యాక్ట్‌లోని సెక్షన్ 6 ప్రకారం ఎయిర్‌పోర్ట్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏదైనా ఘటన జరిగితే విచారణ ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందనే విషయం పోలీసులకు తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరించారని… 166 ప్రకారం వాళ్లు కూడా శిక్షార్హులేనని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆర్కే పిటీషన్‌ను నిశితంగా పరిశీలించిన హైకోర్టు ఈ కేసును ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం ఉందని చెబుతూ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.. ఆ కేసును నేడు విచారించింది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో జగన్ పై దాడి కేసు మరో మలుపు తీసుకుంది.