జగన్‌పై దాడి కేసు.. ఇవాళ హైకోర్టులో విచారణ

జగన్‌పై దాడి కేసు ఇవాళ హైకోర్టులో విచారణకు వస్తోంది. ఈ కేసుపై దాఖలైన నాలుగు పిటిషన్లను కలిపే కోర్టు విచారిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేసిన ఘటనపై ఇవాళ రాష్ట్రప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయనుంది.