ఆస్ట్రేలియాలో ఒకరిని ఒకరు తోసుకున్న కౌశల్, బాబు గోగినేని..(వీడియో)

kaushal-manda-wife-neelima-fires-on-babu-gogineni-in-a-debate

బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కౌశల్, బాబు గోగినేని ఆస్ట్రేలియాలో గొడవపడ్డారు. అక్కడ ఓ ఈవెంట్ లో పాల్గొన్న వీరిద్దరూ షో ముగింపు సమయంలో గొడవకు దిగారు. బిగ్‌బాస్ 2 లో కౌశల్ విజయం సాధించడం వెనుక కౌశల్ ఆర్మీ ముఖ్య పాత్ర వహించింది. అయితే ఈ కౌశల్ ఆర్మీపై బాబు గోగినేని విమర్శలు గుప్పించారు. కౌశల్ ఆర్మీ విషయమై ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో శనివారం డిబేట్ జరిగింది. ఈ డిబేట్‌లో కౌశల్, ఆయన భార్య నీలిమ, బాబు గోగినేని పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాబు గోగినేని మాట్లాడుతూ.. కౌశల్ బిగ్‌బాస్ షోకు రాకముందే ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారని, ఆ తరవాత ఆయన కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్ ప్రకారం ఆర్మీని నడిపించారని ఆరోపిస్తున్నారు. డబ్బులిచ్చి ఈ ఆర్మీని నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే బాబు గోగినేని ఆరోపణలను కౌశల్ భార్య నీలిమ ఖండించారు. ‘ఇట్ ఈజ్ ద మ్యాటర్’ అంటూ బాబుపైకి నీలిమ దూసుకెళ్లారు. దానికి బాబు గోగినేని కౌశల్ దంపతులపై విరుచుకుపడ్డారు. ముమ్మాటికీ అది ఫేక్ అని అన్నాడు. ఈ క్రమంలో కౌశల్, బాబు మధ్య వివాదం మరింత ముదిరింది. దాంతో ఒకరిని ఒకరు తోసుకుంటూ విమర్శలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామజిక మధ్యమాల్లో వైరల్ గా మారింది.