గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం

ఇండియన్ స్టార్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. చాలా రోజుల నుంచి ఆటకు దూరంగా ఉంటున్న గౌతమ్ గంభీర్ ఉన్నపళంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు షాక్ గురయ్యారు.తన రిటైర్‌మెంట్‌ని ఓ ఫేస్‌బుక్ వీడియో ద్వారా ప్రకటించాడు. 2003 ఏప్రిల్ 14న భారత క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టిన గౌతమ్ 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ-20లు ఆడాడు. దాదాపు 15 సంవత్సరాలు టీం ఇండియాలో తన కెరీర్‌ను కోనసాగించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి గంభీర్ 10,324 పరుగులు చేశాడు. వీడియోలో తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అవమానాలు భరించలేకే.. రిటైర్ అవుతున్నట్లు గంభీర్ పేర్కొన్నాడు. క్రికెట్‌లో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.