కొంచెం కూడా తగ్గేది లేదంటున్న కాజల్..

ఇండస్ట్రీకి వచ్చే పదేళ్ల పైనే అయింది. ఆమె తరువాత మరెందరో హీరోయిన్లు వచ్చి వెళ్లారు. అయినా కాజల్ అగర్వాల్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. దాదాపు అందరు ప్రముఖ హీరోలతో నటించింది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి కవచం చిత్రంలో నటించింది. ఈ శుక్రవారం కవచం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలావుండగా శంకర్- కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు-2 చిత్రం కోసం కాజల్‌కి పిలుపు వచ్చింది. శంకర్ ప్రాజెక్ట్, కమల్ హీరో వద్దనేందుకు ఆస్కారమెక్కడ. అందుకే వెంటనే ఓకే చెప్పేసింది. డిసెంబర్ 14 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను హైదరాబాదులో షూటింగ్ జరపనుంది చిత్ర యూనిట్. మరి కొంత కాలం కాజల్ హవా నడుస్తుందని ఫిల్మ్ ఇండస్ట్రీ భావిస్తోంది.