శ్రీలంకలో ముదిరిన రాజకీయ సంక్షోభం

Sri Lanka Court Temporarily Blocks Mahinda Rajapaksa From Prime Minister’s Job

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రతిష్ఠించిన ప్రధాన మంత్రి మహింద రాజపక్సకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానమంత్రి హోదాలో రాజపక్స ఎలాంటి నిర్ణయాలు తీసుకో వద్దని కోర్టు ఆదేశించింది.

Also read : హంగ్ వస్తుందా..? ఎవరి జాతకం ఎలా..

అధ్యక్షుడు సిరిసేన, అక్టోబర్ 26న రణిల్ విక్రమసింఘేను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించి, రాజపక్సను కూర్చోబెట్టారు. అనంతరం, రాజపక్సకు తగిన సంఖ్యలో ఎంపీల మద్దతు లభించే అవకాశం లేకపోవడంతో పార్లమెంటును రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 122 మంది చట్టసభ్యులు, కోర్ట్ ఆఫ్ అపీల్‌ను ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు, రాజపక్స-ఆయన మంత్రివర్గం తమ పదవులకు సంబంధించి ఎలాంటి విధులు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.