రాళ్లు రువ్వడంతో ప్రాణాలు కోల్పోయిన పోలీసు ఆఫీసర్

Subodh Kumar Singh
Subodh Kumar Singh

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షెహ‌ర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోవధ జరిగినట్లుగా వచ్చిన వార్తలు ఓ వ్యక్తి మృతికి దారి తీశాయి. బులంద్‌షహర్‌లో గోవధ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. దాంతో స్థానిక ప్రజలు భారీ ప్రదర్శన చే పట్టారు. నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఓ పోలీసు ఆఫీసర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఓ పోలీస్‌ వ్యాన్‌కు కూడా నిప్పు పెట్టారు. స‌యానా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘటన జ‌రిగింది.

సయనలోని ఓ గ్రామం నుంచి ఓ వ్యానులో ఆవులను తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో గో సంరక్షకలు ధర్నాకు దిగారు. రోడ్లపై వాహనాలు తిరగకుండా ఆంక్షలు పెట్టారు. దీంతో పోలీసులకు, గోసంరక్షకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో… పోలీసులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రెచ్చిపోయిన అల్లరి మూకలు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశాయి. ఈ ఘటనకు పాల్పడ్డారని అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ప్రకటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్.