అందరూ చూస్తుండగానే అమ్మాయిని.. వీడియో వైరల్

రోడ్డు మీద తన మానాన తను నడుచుకుంటూ వెళ్తోంది. క్యాబ్ బుక్ చేద్దామంటే ఇల్లు మరీ దూరం కూడా కాదు. ఎలాగూ ఆఫీసుకి వెళ్లేటప్పుడు హడావిడిగా షేర్ క్యాబ్ బుక్ చేసుకుని వెళుతోంది. కనీసం సాయింత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడైనా కాస్త నడిస్తే వాకింగ్ పని కూడా పూర్తవుతుంది.

అందునా ఆరోజు పుట్టిన రోజు కూడా బాయ్‌ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడేమోనని అప్పటి వరకు ఎదురు చూసింది. ఎంతకీ రాకపోయేసరికి ఉసూరుమంటూ నడుస్తూ వెళుతోంది. ఇంతలో వెనుక నుంచి ఓ అబ్బాయి సడెన్‌గా వచ్చాడు. వస్తూనే నోరు మూసేసాడు. రక్షించండి అని అరవడానిక్కూడా లేకుండా నోరు నొక్కేస్తున్నాడు.

అతడెవరో గుర్తు పట్టే అవకాశం లేకుండా ముఖాన్ని కర్చీఫ్‌తో కవర్ చేసుకున్నాడు. ఆమె చాలా సేపు అతని బంధనాలనుంచి విడిపోవాలని ప్రయత్నించింది. అంతలోనే పక్కనుంచి వ్యాన్ వచ్చి ఆగింది. ఓ క్షణం పాటు ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అర్థమయ్యాక నోట మాట రాలేదు.

అందులో నుంచి ఓ వ్యక్తి దిగి వ్యాన్ డిక్కీ ఓపెన్ చేశాడు. అందులో నుంచి బెలూన్లు ఆమెను పలకరించాయి. వాటితో పాటు మరో నలుగురు వ్యక్తులు దిగారు. అందులో ఓ అమ్మాయి హ్యాపీ బర్త్‌డే చెబుతూ డ్యాన్స్ చేస్తోంది. మిగిలిన వారు చకచకా ఓ స్టూలు, దాని మీద కేకు అరేంజ్ చేశారు.

బాయ్ ఫ్రెండ్ నీకు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పాలనిపించి ఇలా ప్లాన్ చేశాము అని అన్నాడు. ఇబ్బంది పెడితే క్షమించేయవూ అంటూ కాళ్లమీద పడేసరికి ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యింది. సూపర్ ఐడియా గురూ.. అంటూ హ్యాపీగా కేట్ కట్ చేసింది. దిసీజ్ వెరీ వెరీ స్పెషల్ బర్త్‌డే ఇన్ మై లైఫ్ అంటూ వారితో తన ఆనందాన్ని పంచుకుంది.