3 నిమిషాల్లో 15 వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దమ్మపేట మండలంలో నిర్వహించే ప్రజాకూటమి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
————————-
ఎన్నికల ప్రచారం ఆఖరు దశకు చేరడంతో.. టీఆర్‌ఎస్‌ నేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గజ్వేల్‌లో ఇవాళ ఆఖరి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కేసీఆర్‌. ఈ సభతో ప్రచారానికి ముగింపు పలుకనున్నారు.
————————-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌. వీఐపీ విరామ సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు గవర్నర్‌ దంపతులు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
————————-
దానం నాగేందర్ జేబులో ఎప్పుడూ అన్ని పార్టీల కండువాలు ఉంటాయని ఆరోపించారు ఖైరతాబాద్‌ బీఎస్పీ అభ్యర్థి మన్నె గోవర్దన్‌ రెడ్డి. పూటకో పార్టీ మారే దానంను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చివరి రోజు కావడతో విస్తృత ప్రచారం చేపట్టారు మన్నె గోవర్ధన్‌…
————————-
తలసానికి ఓటమి భయం పట్టుకుందన్నారు సనత్‌ నగర్‌ ప్రజా కూటమి అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్‌…. ఇప్పటికే రాహుల్, చంద్రబాబు, బాలకృష్ణ , నగ్మా, విజయశాంతిల రోడ్ షోలతో ఆయన ప్రచారాన్ని విస్తృతం చేశారు. ప్రజా కూటమికే జనం పట్టం కట్టడం ఖాయమన్నారు.
————————-
మరోసారి ప్రజలను మోసం చేయడానికి టీఆర్‌ఎస్‌, బీజేపీలు మైండ్‌గేమ్‌ ఆడుతున్నాయని ఆరోపించారు ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి అనిల్‌కుమార్‌ యాదవ్‌. నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
————————-
బీజేపీకి ఓటువేస్తే భరతమాతకు ఓటు వేసినట్లేనన్నారు స్వామి పరిపూర్ణానంద. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్‌ నరేన్ గార్డెన్స్‌లో బీజేపీ అభ్యర్థి యోగానంద్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. విద్యావంతుడైన యోగానంద్‌ను గెలిపించుకుంటే …ప్రణాళికతో ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాడని చెప్పారు .
————————-
నాలుగున్నరేళ్లలో కేసీఆర్ మాటలు చెప్పడం తప్ప.. కొత్తగా చేసిందేమీ లేదన్నారు ఎల్బీనగర్‌ ప్రజా కూటమి అభ్యర్థి సుధీర్‌రెడ్డి… నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. చంద్రబాబు, విజయశాంతి, రేవంత్‌ రెడ్డి రోడ్‌షోలతో కార్యకర్తల్లో జోష్‌ పెరిగిందన్నారు.
————————-
పటాన్‌చెరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహిపాల్‌ రెడ్డి తరపున ఆయన భార్య ప్రచారం చేపట్టారు… నేటితో ప్రచారం ముగుస్తుండటంతో విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు… తెలంగాణలో సమర్థవంతమైన పాలన రావాలంటే కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలన్నారు….
————————-
తెలంగాణలో మహాకుటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం చివరి రోజు కావడంతో ఆనంద్‌కు మద్దతుగా పలువురు టీడీపీలో చేరారు… దీంతో తన గెలుపు ఖాయమని ఆనంద్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు…
————————-
కుత్బుల్లాపూర్‌ మహాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌కు అన్ని వర్గాల నుంచి మద్ధతు లభిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు… కేసీఆర్‌ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారన్నారు…
————————-
పరకాలలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు…. కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖ… గతంలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్దిని ప్రజలకు గుర్తు చేస్తున్నారు.మహాకూటమి విజయంపట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు.
————————-
ఉప్ప‌ల్‌లో టీడీపీ అభ్యర్థి వీరేందర్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తన విజయం ఖాయమని వీరేందర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉప్పల్ వాసులు ప్రజాకూటమికే ఓటు వేస్తారని వారు తెలిపారు.
————————-
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగారు. పీజేఆర్ చేసిన సేవలే తనను గెలిపిస్తాయన్నారు.
————————-
తాజా రాజకీయ పరిణామాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఈ ధోరణి ప్రమాదకరమన్నారు.