3 నిమిషాల్లో 15 వార్తలు

3 MINITUTES

గజ్వేల్‌లో టీఆర్ఎస్‌ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కూటమిపై విమర్శల వాగ్భాణాలు ఎక్కుపెట్టారు. తనను ఓడించడానికి చేతకాక.. చంద్రబాబును తీసుకొచ్చారని కేసీఆర్‌ విమర్శించారు.
————————
నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాటం సాగిందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. కోదాడలో నిర్వహించిన మహాకూటమి బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్.. ప్రత్యేక రాష్ట్రం కోసం రైతులు, మహిళలు, యువకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని వ్యాఖ్యానించారు.
————————
విభజన తర్వాత సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని కేసీఆర్‌ పై చంద్రబాబు మండిపడ్డారు. కోదాడలో ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతికి మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఇంటికి పంపాలని ప్రజలను కోరారు.
————————
టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని చంద్రబాబు విమర్శించారు. ఇవే టీఆర్ఎస్‌కు చివరి ఎన్నికలు కావాలన్నారు. డిసెంబర్‌ 11 తర్వాత ఆపద్ధర్మ సీఎంగా ఉన్న కేసీఆర్‌.. మాజీ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.
————————
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ కేసులో వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు పడింది. అన్నపూర్ణ స్థానంలో అవినాష్‌ మహంతిని నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
————————
రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి గణేష్‌ గుప్తా ప్రచారం నిర్వహించారు. శంషాబాద్‌లోని వివిధ కాలనీల్లో పర్యటించి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.
————————
రాజేంద్రనగర్‌ నియోజకవర్గం టీఆర్ఎస్‌ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంతో పాటు రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులు మూడోస్థానానికి పరిమితమవుతారని… ప్రధాన పోటీ ఎంఐఎంతోనే అని అభిప్రాయపడ్డారు.
————————
సంగారెడ్డి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్‌ పార్టీకి ఎస్సై నరేందర్‌ వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. డీఎస్పీ ఎస్సై నరేందర్‌ను సంగారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయానికి అటాచ్‌ చేయడంతో గొడవ సద్దుమణిగింది.
————————
తన నియోజకవర్గంలో 50 వేల మెజార్టీతో తమ గెలుపు తథ్యమన్నారు సికింద్రాబాద్ మహాకూటమి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌. ప్రతి డివిజన్‌లో భారీ జనసమీకరణతో ర్యాలీ నిర్వహించారు. సీతాఫల్‌మండి, అడ్డగుట్ట, తార్నాకలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. గెలుపు తమ వెంటే ఉందని కాసాని జ్ఞానేశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు.
————————
కేటీఆర్‌ తనపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. చాదర్‌ఘాట్ దగ్గర డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను తాను అడ్డుకున్నానని ఆరోపించడం అవాస్తవమన్నారు. దీనిపై బహిరంగ చర్చకు కేటీఆర్‌ సిద్ధమా అని సవాల్‌ విసిరారు. తన అడ్డు తొలగించుకోడానికి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారన్నారు కిషన్‌రెడ్డి.
————————
మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య నియోజకవర్గంలో పర్యటించారు. అటు, గతంలో ఎల్బీనగర్ నుంచి ప్రతినిధ్యం వహించిన ఆయన.. ఈసారి అక్కడ ప్రజాకూటమి అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మద్దతి ఇవ్వాలని కోరారు. బీసీ సంఘాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
————————
గూడెం మహిపాల్‌ రెడ్డిని అత్యధిక మోజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి యాదమ్మ పిలుపునిచ్చారు. పటాన్‌చెరు పరిధిలోని బొల్లారంలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణతో కలిసి యాదమ్మ రోడ్ షో నిర్వహించారు. బొల్లారంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని… మరోసారి మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తామని ఆమె చెప్పారు.
————————
దేశ రక్షణ కోసం పనిచేసిన, విద్యావంతుడైన పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిని గెలిపించుకోవాలని స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు కరుణాకర్‌రెడ్డితో కలిసి పరిపూర్ణానంద రోడ్‌ షోలో పాల్గొన్నారు.
————————
ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్ధి యోగానంద్‌. చందానగర్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్ధించారు. తన గెలుపునకు సహకరించాలని కోరారు.
————————
వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ సెక్రెటరీ గులాంనబీ ఆజాద్‌, సినీ నటి కుష్బూ, అజారుద్దీన్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఎప్పుడూ ఫామ్‌ హౌస్‌లో ఉండే కేసీఆర్‌ మంత్రుల పనితీరుపై… ప్రజల గురించి ఆలోచన లేదని విమర్శించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.