ప్రియాంక పెళ్లిగౌను అదిరెన్.. ఆమె వెనుక అయిదుగురు..

చిట్టి పొట్టి డ్రస్సులు వేసుకుని అవి కూడా బరువైపోయినట్లు ఫీలవుతుంటారు తారలు. సందర్భం వస్తే వారే 100 మీటర్ల క్లాత్‌తో డ్రస్ కుట్టించి వయ్యారాలు ఒలికించగలరు. ప్రియాంక తన పెళ్లి వేడుకల్లో భాగంగా 75 అడుగుల రాల్ఫ్ వేల్ డ్రెస్ ధరించి అతిధులను ఆకర్షించింది.

ఆమె వేదిక మీదకు వస్తున్నప్పుడు ఓ అయిదుగురు వ్యక్తులు ఆ డ్రెస్‌ని అటూ ఇటూ పట్టుకుని తీసుకు వచ్చారు. అందరిలా పెళ్లి చేసుకుంటే అందులో మజా ఏముంటుంది. అందుకే కొంచెం స్పెషల్‌గా కనిపించాలనుకుంది. అందుకోసం భారీ ఏర్పాట్లతో పెళ్లి చేసుకుంది.

తొలుత డిసెంబర్ 1న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన ఈ జంట, 2వ తేదీన హిందూ సంప్రదాయం ప్రకారం రెండోసారి వివాహం చేసుకున్నారు ప్రియాంక, నిక్ జోనస్‌లు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ముఖ్యమైన సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వివాహ వేడుకలు జరిగాయి.

క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహ వేడుకలో ప్రియాంక తెల్లటి డ్రెస్ దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతలా మెరిసిపోయింది. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహంలో రెడ్ డ్రెస్‌లో ప్రియాంక ముచ్చటగొలిపింది తన అందంతో. నిక్ జోనస్ హాలివుడ్‌కి చెందిన వ్యక్తి అయినా హిందూ సాంప్రదాయ పద్దతులను పాటిస్తూ పెళ్లి వేడుకల్లో పాలు పంచుకోవడం అతిధులను ఆకట్టుకుంది. జంట చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.