న్యూ కలెడోనియా దీవుల్లో భారీ భూకంపం

Authorities Lift Tsunami Warning For South Pacific Islands After Massive Quake

పసిఫిక్‌ మహాసముద్రంలోని వనౌటూ, న్యూ కలెడోనియా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6 గా నమోదైంది. దీంతో అస్ట్రేలియాకు తూర్పువైపున్నదీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలెడోనియాకు చెందిన లాయాలిటీ దీవులకు ఆగ్నేయంవైపున 155 కిమీటర్ల దూరంలో 10 కిమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో సునామీ ప్రభావం ఉండొచ్చని పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌​ హెచ్చరించింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.