అమెరికాలో అయ్యప్ప పడి పూజ

అమెరికాలోని హ్యూస్టన్ లో అయ్యప్ప పడి పూజలను భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక షిర్డి సాయి జలరం మందిర్ లో జరిగిన పడిపూజా కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని తరించిపోయారు.

దాదాపు 2వందల మందికిపైగా భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామిని అర్ఛనలు, అభిషేకంతో కొలిచారు. ఈ సందర్బంగా అయ్యప్ప స్వామి పడిపూజను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. అమెరికాలోను అయ్యప్పను పూజించడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.