ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

love-couple-commits-suicide-tamil-nadu

పెద్దలు ప్రేమను ఒప్పుకోరన్న అబద్రతాభావంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అస్సాం రాష్ట్రానికి చెందిన మిదింగనర్సరి (19), రోమళాప్రేమ (18). వీరిద్దరూ కోయంబత్తూరు జిల్లా నెగమమ్‌ సమీపం కాట్టమ్‌పట్టిలో ఉన్న కోళ్ల ఫాంలో పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

Also read : మాజీ సీఎం యడ్యూరప్పకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట

ఈ విషయం గత నెల తమ పెద్దలకు చెప్పారు. అయితే వారు ఇంటికి రండి వివాహం చేస్తామని చెప్పారు. కానీ వారికీ నమ్మకం కుదరక ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెద్దలకు చెప్పకుండా పెళ్లిచేసుకోవడం ఇష్టం లేక తల్లిదండ్రుల మీద నమ్మకం కోల్పయి మనస్థాపం చెందారు. దాంతో అదే కోళ్ల పామ్ లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.