నగ్న సెల్ఫీలు హామీగా విద్యార్థులకు రుణం.. ఓ సంస్థ భాగోతం

సమాజం ఎంత భ్రష్టుపట్టిపోతోంది. ఆధునిక మానవుడు నాగరిక సమాజంలో అనాగరికంగా ప్రవర్తిస్తున్నాడు. భవిష్యత్ అంతా యువతదే అని భావిస్తున్న తరుణంలో వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అది భారతదేశమైనా లేదా మరో దేశమైనా. అమ్మాయిల అర్థనగ్న ఫోటోలను అంగట్లో పెట్టి వ్యాపారం సాగిస్తున్నారు.

చైనీస్ ఈ- కామర్స్ పేరిట ఏర్పడిన ఓ స్టార్టప్ కంపెనీ నిరుపేద చైనా విద్యార్థినుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకుని వ్యాపారం చేస్తోంది. వారి నగ్న సెల్ఫీలను హామీగా పెట్టుకుని రుణాలు ఇస్తున్న ఘటన వెలుగు చూసింది. విద్యార్థినుల రోజువారీ ఖర్చులు, కళాశాల ఫీజుల కోసం వారి నగ్న సెల్ఫీలు తీసుకుని రుణాలు మంజూరు చేసేది.

విద్యార్థులు తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకుంటే నగ్న సెల్ఫీలను బయటపెడతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఇలా విద్యార్థినులకు ఇచ్చిన రుణాలపై అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఆ దేశ ఆర్థిక నిబంధనలకు విరుద్ధంగా ఈ కామర్స్ పేరిట ఏర్పడిన కంపెనీ విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తేలింది. విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేసి ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వీలులేకుండా సంస్థను సీజ్ చేశారు.