మాజీ సీఎం యడ్యూరప్పకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట

sc-relief-for-yeddyurappa

కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. 2011లో యడ్యూరప్పపై లోకాయుక్త కోర్టులో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సిరాజిన్ బాషా తదితరులు నాటి గవర్నర్‌ అనుమతితో యడ్యూరప్పపై లోకాయుక్త కోర్టులో అవినీతి ఆరోపణలపై ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఇది రాజకీయ కలకలం రేపి యడ్యూరప్ప పదవి కోల్పోయేలా చేసింది. ఈ పిటిషన్లను సవాల్ చేస్తూ యడ్యారప్ప సుప్రీంకోర్టుకు వెళ్లగా, 2015 నవంబరు 25న యడ్యూరప్పపై దాఖలైన పిటీషన్‌లు చెల్లబోవని కోర్టు కొట్టివేసింది. ఐతే, ఈ తీర్పుపై పిటిషనర్ సిరాజిన్‌తో పాటు కర్ణాటక ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. మళ్ళీ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఆ పిటిషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పిటీషనర్‌ సిరాజిన్‌ దాఖలు చేసి 5 పిటీషన్‌లను కూడా రద్దు చేసింది. సుప్రీం తీర్పుపై యడ్యూరప్ప సహా బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై అపార నమ్మకంతో 2011 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నానని ఎట్టకేలకు తన నిర్దోషిత్వం బయట పడిందని యడ్యూరప్ప సంతోషం వ్యక్తం చేశారు.