శివపార్వతుల కళ్యాణానికి సర్వం సిద్ధం

శివపార్వతుల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఈ అపూర్వఘట్టాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఎప్పటిలాగే ఈసారి కూడా టీవీ5, హిందూధర్మం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఈ కల్యాణోత్సవంలో ప్రసాద వితరణ కోసం.. వేములవాడ క్షేత్రం నుంచి లడ్డూలు, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి పసుపు కుంకుమలు, పళని సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం నుంచి దివ్య పరిమళ విభూదితోపాటు ముక్కంటి శిరస్సుపైనుంచి జాలువారిన దివ్యాక్షతలు, సాక్షాత్తూ శివస్వరూపమైన రుద్రాక్షలు, పవిత్ర గంగాజలం, వీటితోపాటు 9 రకాల విశిష్ట ద్రవ్యాలను భక్తులకు ప్రత్యేక ప్యాకెట్ రూపంలో అందించబోతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కర్నూలులో జరుగుతున్న కల్యాణోత్సవానికి అశేష భక్తులు తరలివస్తారని అంచనాలున్న నేపథ్యంలో.. అందరికీ ప్రసాదం అందేలా చూసేందుకు అంతా సిద్ధమైంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.