ఫోర్బ్స్‌ జాబితాలో విజయ్ దేవరకొండ.. ఏ స్థానమో తెలిస్తే..

vijay-devarakonda-gets-place-forbes-india-celebrity-list

కెరీర్ బిగినింగ్ నుంచి లక్కీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌ లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసి.. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.. అనంతరం టాక్సీవాలా సినిమాలతో అదే జోరు కంటిన్యూ చేసి.. తాజాగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించాడు. 2018లో అత్యధిక ఆదాయాన్ని పొందిన సౌత్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది ఫోర్బ్స్‌.

Also read : చనిపోయిన మహిళ గర్భసంచి మార్పిడి.. బిడ్డ చూస్తే..

ఇందులో అగ్రస్థానంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నిలవగా పవన్‌ కల్యాణ్‌, విజయ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్, విక్రమ్‌, మహేష్‌ బాబు, సూర్య, ,నయనతార విజయ్‌ సేతుపతి ఉన్నారు. ఈ జాబితాలో విజయ్ 14 కోట్ల ఆదాయంతో 72 వ స్థానంలో నిలిచాడు. కాగా ఇండియా మొత్తంలో బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ 253.25 కోట్ల ఆదాయంతో తొలిస్థానంలో నిలవగా విరాట్‌ కోహ్లీ 228.09 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు.