చనిపోయిన మహిళ గర్భసంచి మార్పిడి.. బిడ్డ చూస్తే..

womb-transplant-deceased-women-successful-brazil

జన్యుపరమైన లోపం కారణంగా కొందరు మహిళలు మాతృత్వం పొందలేకపోతున్నారు. అయితే వైద్యశాస్త్రంలో అత్యాధునిక టెక్నాలజీ సంతాన భాగ్యాన్ని కల్పిస్తున్నాయి. సరోగసి, గర్భసంచి మార్పిడి పద్ధతుల ద్వారా ఎంతో మందికి తల్లులుగా మారే అవకాశం లభిస్తోంది. ఇక జన్యు లోపం కారణంగా పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుడతారు మరికొందరు. ఇది 4500 మందిలో ఒకరికి వచ్చే మేయర్‌-రాకిటాన్స్‌కీ-కస్టర్‌- హాసర్‌ అనే సిండ్రోమ్‌, దీని కారణంగా జర్మనీకి చెందిన ఓ మహిళ పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుట్టింది. దాంతో పెళ్ళైనా తల్లయే అవకాశం లేకుండా పోయింది. డాక్టర్లను సంప్రదించగా గర్భసంచి మార్పిడి ద్వారా ఆ అవకాశం ఉందని వారు చెప్పారు.

Also read : అందరూ చూస్తుండగానే అమ్మాయిని.. వీడియో వైరల్

అయితే బ్రతికున్న మహిళ గర్భసంచి కాకుండా ఎవరైనా చనిపోయిన మహిళ గర్భసంచి అయితే బాగుంటుందని ఆమె డాక్టర్లకు చెప్పింది. ఈ క్రమంలో చనిపోయిన 40 ఏళ్ల మహిళ నుంచి గర్భసంచిని సేకరించి 2016లో ఆమెకు అమర్చారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంతో ఆమెకు రుతుస్రావం మొదలై.. 2017లో గర్భం దాల్చింది. దాంతో డిసెంబరు 5న సిజేరియన్‌ ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చారు. పుట్టిన సమయంలో రెండున్నర కిలోల బరువు ఉన్న ఆ శిశువు ప్రస్తుతం ఏడున్నర కిలోల బరువు పెరిగిందని బ్రెజిల్ కు చెందిన ‘ద లాన్‌సెట్‌ మెడికల్‌ జర్నల్‌’ ప్రచురించింది. అయితే ఇక్కడ విశేషమేమంటే గతంలో చనిపోయిన మహిళల గర్భసంచి అమర్చడం ద్వారా బిడ్డకు జన్మనిచ్చినా.. ఆ శిశువులంతా ఏడాదిలోపే మరణించారు. కానీ ఈ బ్రెజిల్ మహిళకు జన్మించిన ఆ బిడ్డ మాత్రం ఆరోగ్యంగా పెరిగి పెద్దదవుతుండడంతో వైద్యుల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. వైద్య చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా వారు చెబుతూ.. ఈ విషయాన్నీ పంచుకున్నారు.