3 నిమిషాల్లో 15 వార్తలు

3 MINITUTES

తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్. ఓటు వేయడంలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 30 వేల వాలంటీర్లను పెడుతున్నామని తెలిపారు.
—————————
ఈ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అడుగడుగునా నిఘా పెట్టామన్నారు రజత్‌ కుమార్‌. పక్కా ఏర్పాట్ల మధ్య ఎన్నికల్ని శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు…
—————————
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కూకట్‌పల్లి రిటర్నింగ్‌ అధికారి మమత. నియోజకవర్గ పరిధిలో 383 పోలింగ్‌ స్టేషన్లకు సంబధించిన సామాగ్రిని పంపిణీ చేశారు…. ఓటర్ల లిస్టులో తమ పేరు ఉందో లేదో ధృవీకరించుకోవాలన్నారు….
—————————
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారులు పోలింగ్‌ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 2 వేల 303 బూత్‌లకు ఈవీఎంలను పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాలో 9 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు.
—————————
మహేశ్వరం నియోజవర్గం ఎన్నికలు సజావుగా జరగటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్‌ను కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో ఏర్పాటు చేశారు. మొత్తం 460 పోలింగ్ కేంద్రాల్లో 2760 మంది సిబ్బంది విధులకు హాజరవుతున్నారు.
—————————
సూర్యాపేట్, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించిన సిబ్బందికి కలెక్టర్ సురేంద్ర మోహన్ సూచనలు చేశారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సామాగ్రిని అందించారు.
—————————
ఉమ్మడి వరంగల్ జిల్లా పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. 12 నియోజకవర్గాలకు సిబ్బందిని.. పోలింగ్ మెటీరియల్‌ను చేరవేస్తున్నారు.
—————————
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా.. 17 లక్షల మంది ఓటర్లున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బందికి సామాగ్రి అందిస్తున్నారు.
—————————
శాంతియుత వాతావరణంలో పోలింగ్‌ జరిగేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌.. ఎస్పీ ,రిటర్నింగ్‌ అదికారులతో సమావేశం నిర్వహించారు.
—————————
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ సిబ్బంది హడావుడి మొదలైంది. నియోజకవర్గంలో 269 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోవటానకి సిద్దం అవుతున్నారు.
—————————
ఖమ్మం జిల్లాలో వెబ్ క్యాస్టింగ్‌ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. పోస్టల్ బ్యాలెట్ ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు అలాంటి అవకాశం లేదని చెప్పడంతో ఆందోళనకు దిగారు.
—————————
కరీంనగర్‌ జిల్లాలో పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామన్నారు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిలుచున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు.
—————————
ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు వేసింది. ‘రాబోయే తరం పర్యావరణ రవాణా’పై చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కార్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
————————-
ఈ కార్లకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించవచ్చు. ఇందుకోసం విజయవాడలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఏపీలోని ఆకర్షణీయ పట్టణాలు, నగరాలలో పర్యావరణహితమైన ఆధునిక రవాణా వ్యవస్థకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
—————————
అడిలైడ్‌ టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్లు నష్టపోయి 250 పరుగులు చేసింది… 30 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కొహ్లీ సేనను ఛటేశ్వర పుజారా సెంచరీతో ఆదుకున్నాడు…