చిన్నపిల్లాడు అని కూడా చూడకుండా…

చిన్న పిల్లలు అని కూడా చూడకుండా గురువులు వారిపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో హోమ్‌వర్క్ చేయలేదని నాల్గవ తరగతి విద్యార్థిని చావబాదాడు ఓ టీచర్. విద్యార్థి కాళ్ళపై ఉన్న దెబ్బలను చూసిన తల్లిదండ్రులు పాఠశాల చేరుకోని సంబంధిత ఉపాధ్యాయున్ని నిలదీశారు. దీంతో స్పందించిన పాఠశాల యాజమాన్యం బాలుని తల్లిదండ్రులకు క్షమాపణ చేప్పారు. ఈ సంఘటనపై డీఈవో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. విచారణ అనంతరం సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు.

 

Recommended For You

1 Comment

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.