హీరోయిన్ ‘వారియర్’ తలకు గాయం.. 10కి పైగా కుట్లు..

మాలీవుడ్ బ్యూటీ మంజు వారియర్ షూటింగ్ సమయంలో గాయ పడింది. ప్రస్తుతం సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాక్ అండ్ జిల్’ మూవీలో నటిస్తోంది మంజు. ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తుండగా ఆమె కిందపడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు ఆమె తలకు 10 పైగా కుట్లు వేసినట్లు మాలీవుడ్ టాక్.

మంజూ వారియర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు మూవీ యూనిట్. ఫ్యాన్స్ ఆందోళన పడవద్దని త్వరలోనే మళ్లీ మంజు షూటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు.

మాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల్లో ఒకరైన మంజూ మలయాళ హీరో దీలీప్‌ని వివాహం చేసుకున్నారు. లైంగిక ఆరోపణ కేసులో దీలీప్ జైలుకి వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోయారు.

ఇది ఇలా ఉంటే ‘ఓడియన్’ మూవీలో మోహన్ లాల్‌కు జోడీగా నటించింది మంజు. ఈ మూవీ డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.