చంద్రబాబుతో బాబా రాందేవ్‌ భేటీ

baba-ramdev-meet-with-ap-cm-chandrababunaidu

చంద్రబాబుతో బాబా రాందేవ్‌ భేటీ అయ్యారు. విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేయనున్న మెగా ఫుడ్ పార్క్ గురించి ముఖ్యమంత్రికి రాందేవ్‌ వివరించారు. 634 కోట్ల రూపాయలతో ఆహార శుద్ధితో పాటు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు రాందేవ్‌. ఈ సంస్థ ద్వారా సుమారు 33,400 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందె అవకాశం ఉందన్నారు. ఈ మెగా ఫుడ్ పార్క్ కోసం ప్రభుత్వం 172.84 ఎకరాలు భూమిని కేటాయించింది.