ఏమైంది.. ఎందుకలా.. వీడియో వైరల్

ఏంటి.. దాన్ని చూడగానే నా గొంతు మూగబోయింది. ఏమో.. హ్యాపీగా నాకు ఇష్టమైన ఆహారం ఎలుకల్ని పట్టుకుని తిని బతుకుతుంటే ఈ పెద్దింటి వారు తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. ఖరీదైన బిస్కట్లు, కప్పులో పాలు పోసి ఇస్తున్నారు. వారి పిల్లలు చూసే కార్టూన్ ఛానెల్ నన్నూ చూడమంటారు.

నేను అడుగు తీసి బయట పెట్టడానికి వీల్లేదు. కింద నడిచే పన్లేదు, నోరు విప్పి మ్యావ్ మ్యావ్‌మంటూ అస్సలు అరవక్కరలేదు. అడక్కముందే అన్నీ పెట్టేస్తారు. అందుకే ఆశ్చర్యంగా అనిపించే ఏదైనా వస్తువుని చూస్తే అరవడం మానేసి కళ్లు తేలెయ్యాల్సి వస్తుంది. మరో 20 రోజుల్లో రాబోయే క్రిస్మస్ కోసం మా ఇంట్లో అప్పుడే సందడి మొదలయ్యింది.

మా ఇంటి ఓనర్ అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ అక్కడ పెట్టారు. ఎందుకో దాన్ని చూడగానే నాకు ఒకింత ఆశ్చర్యం, మరింత భయం కలిగాయి. నా పేరు తారా చాన్ అని నేను జపాన్‌లో ఉంటాననే విషయాన్ని కూడా మరిచి పోయాను. చాలా సేపు క్రిస్మస్ ట్రీని చూస్తూ అలానే ఉండిపోయాను. భలే వెరైటీగా అనిపించింది.

నేను ఈ ఇంటికి వచ్చి ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు. అందుకే అన్నీ వింతగా కనిపిస్తున్నాయి. ఇంకా ఏమేం చూడాలో. అయినా బావుందిలెండి ఈ లైఫ్ కూడా కడుపులో చల్ల కదలకుండా అన్నీ సమకూరుస్తున్నారు. మరీ.. సోమరిపోతులా తయారయ్యవేంటి అని మాత్రం అంటే నేను ఊరుకోనండి. అవసరమైతే పిల్లి కూడా పులి అవుతుందని మీరూ వినే వుంటారు. జాగ్రత్త.. నాతో పెట్టుకోకండి.

 

View this post on Instagram

 

Wow, Can you see anything? 👻🙀 . タラちゃん、あなたには何が見えるの?🙀‼️ 今日はかなり長い時間立っててビックリしましたー。 途中から伸びたりするのが 納豆の #ねばーる君 みたいに思えたのは私だけでしょうか😂 . 実際は、新しいガーデンホースで水やりしてるお父さんの姿にびっくりしてたみたいです。茶色のホースだからヘビにでも見えたのかな…かなりの大蛇😂 . #catloversclub #9gag #funnycat #catsofinstagram #meowed #pleasantcats #bestmeow #weeklyfluff #instagram #catoftheday #scottishfold #animalsco #catsofworld #thedodo #instacats #makemyday #cutecatcrew #ilovemycat #adorable

A post shared by yayoi89 (@yayoi89) on

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.