పనిమనిషిని చంపి.. చివరకు ఎలా బుక్కయ్యాడో చూస్తే..

chandigarh-man-killed-labourer-burns-body-insuranc

భీమా సోమ్ముకోసం పనిమనిషి ప్రాణాలు తీశాడోవ్యక్తి. అయితే కుటుంబసభ్యుల కారణంగా అడ్డంగా దొరికిపోయాడు. చండీఘర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చండీఘర్ కు చెందిన ఆకాశ్‌ వృత్తిరీత్యా వ్యాపారస్తుడు. వ్యాపారంలో బాగానే డబ్బు సంపాదించాడు. అయితే మధ్యలో చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కన్నుమిన్ను కానకుండా సంపాదించిన డబ్బంతా ఖర్చు చేసి.. అప్పులు చేశాడు. గతనెల అతని వద్దకు రాజస్థాన్ కు చెందిన వ్యక్తి పనిమనిషిగా చేరాడు. అంతకుముందే ఆకాష్ తన పేరుమీద ఇన్సూరెన్స్ బీమా చేయించుకున్నాడు. తాను చనిపోతే భారీగా డబ్బు వస్తుందన్నఆశతో.. అతడివద్ద పనిమనిషిగా చేరిన అమాయకుడిని హతమార్చాడు.

Also read : ఎవరెవరి సంపాదన ఎంతంటే..

ఆ వ్యక్తి ఆనవాళ్లు తెలియకుండా కారులో ఉంచి తగలబెట్టేశాడు.ఇక పథకంలో భాగంగా కారు ప్రమాదంలో ఆకాశ్‌ మరణించాడంటూ అతడి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ పక్క దర్యాప్తు జరుగుతుండగానే ఆకాశ్‌ మరణ ధ్రువీకరణపత్రం కావాలంటూ కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దాంతో వారిమీద అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అప్పటికే నేపాల్ పారిపోయిన ఆకాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.