రెండంకెల వృద్ధి సాధించాం : సీఎం చంద్రబాబు

cm chandrababunaidu talk about two digit growth

రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రణాళికాబద్దంగా పని చేసి, రెండంకెల వృద్ధి సాధించామన్నారు. తిరుపతిలో నిర్వ హించిన పేదరింకపై గెలుపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 10 వేల 138 మంది లబ్ది దారులకు పనిముట్లు, నిధులు పంపిణీ చేశారు. అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, పించన్ పథకాలతో పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటోందని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అన్న ఆయన, బీసీ వర్గాలకు అండగా ఉంటామని పునురుద్ఘాటించారు. చేతివృత్తులవారికి నాణ్యమైన పనిముట్లు ఇస్తామన్న బాబు, కొత్త గోకులాలను తీసుకొచ్చామని వివరించారు. రాయలసీమలో హంద్రీనీవా నీళ్లు పారించే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు.