బీజేపీకి భారీ షాక్.. కీలక ఎంపీ రాజీనామా..

dalit-mp-savitri-bai-phule-quits-bjp

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక ఎంపీ సావిత్రి భాయ్ పూలే బీజేపీకి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. ప్రస్తుతం ఆమె ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీలోదళిత నాయకురాలుగా గుర్తింపు పొందిన సావిత్రి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ను పలు సందర్భాల్లో వ్యతిరేకించారు. సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. హనుమంతుడు దళితుడంటూ ముఖ్యమంత్రి యోగి వివాదానికి తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేత్కర్ వర్ధంతి రోజున ఈ పరిణామం చోటుచేసుకోవడం బీజేపీలో చర్చనీయాంస్యమైంది.