ఎన్నెన్నో జన్మల బంధం.. నీదీ.. నాది.. నన్నొదిలి..: అక్కినేని అఖిల్

నేను లేందే ఒక్క క్షణం ఉండలేదు. నా పరిస్థితి కూడా అంతే ఉదయం లేవగానే అది కనిపించాలి. దానితోనే నా రోజు మొదలవుతుంది. పదమూడేళ్లుగా నాతోనే ఉంటూ, నా జీవితంలో ఓ భాగమైపోయింది. నా లియో ఇప్పడు విశ్రాంతిని కోరుతూ నా నుంచి దూరంగా వెళ్లి పోయింది. ఎక్కడ ఉన్నా తన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.

ఒక శునకంతో ఇంత అనుబంధాన్ని పెనవేసుకోవడం ఇదే మొదటిసారి. నిన్ను నాదగ్గరకు చేర్చిన ఆ దేవుడికి  వేల వేల కృతజ్ఞతలు. నా జీవితంలో ఎన్నో ఆనందక్షణాలిచ్చిన నా లియోకి ప్రేమ పూర్వక ధన్యవాదాలు. ఇక నుంచి నువ్వు నాతో ఉండవనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నువు లేని జీవితం ఇంతకుముందు ఉన్నంత ఆనందంగా ఉండకపోవచ్చు. నువ్వు లేని లోటు తీర్చలేనిది. ఐ లవ్యూ మై డియర్.. ఐ మిస్ యూ అంటూ అఖిల్ తన ఆవేదనను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

తన పెంపుడు శునకం లియో మరణం తనకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని తన బాధను ఇన్‌ష్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అఖిల్. తనకు అమ్మ పంచే ప్రేమ లోని మాధుర్యాన్ని అంతే ప్రేమగా పంచుకున్నాడు అఖిల్ లియోతో. నోరు లేని మూగజీవాలు యజమానుల పట్ల చూపించే అవ్యాజమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి శునకాలు. ప్రాణంగా ప్రేమించే శునకం దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. కొన్ని రోజులు ఆమధుర జ్ఞాపకాలు మదిని తొలుస్తుంటాయి.