టీఆర్ఎస్ అభ్యర్థిపై ఫిర్యాదు చేసిన నందమూరి సుహాసిని

nandhamoori suhasini compalint against on madhavaram krishnarao

కూకట్‌పల్లి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.