రూ.1350 కోట్లతో చేపట్టే నిర్మాణ పనులకు లోకేష్‌ శంకుస్థాపన

పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంత మత్స్యకారుల కల సాకారమైంది. నరసాపురం మండలం బియ్యపు తిప్ప గ్రామంలో నిర్మిస్తున్న హార్బర్‌ కల సాకారమైంది. రూ.1350 కోట్లతో చేపట్టే నిర్మాణ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేశారు.

రెండు రోజుల పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటనకి వచ్చిన లోకేష్‌ మొగల్తూరు మండలంలో పర్యటించారు. సుమారు 50 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో షిప్పింగ్‌ హార్బర్‌ కూడా ఉంది. కేవలం ఆరు నెలల్లోనే హార్బర్‌ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని మంత్రి లోకేష్‌ వివరించారు. టీడీపీని ఆదరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లాలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 11 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.