ఎవరెవరి సంపాదన ఎంతంటే..

ప్రతిఏటా సెలబ్రిటిల ఆదాయానికి సంబంధించి ఫోర్బ్స్ పత్రిక జాబితాను విడదల చేస్తుంది. ఈ క్రమంలో 2018 సంవత్సరానికి గాను ఇండియాలో వివిధ రంగాల్లో ఉన్న సెలబ్రిటీల ఆదాయాన్ని ప్రచురించింది. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు అత్యధికంగా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వారిలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 253 కోట్ల ఆదాయంతో ఎప్పటిలాగే మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తరువాత అక్షయ్ కుమార్ 185 కోట్లతో మూడో స్థానంలో ఉండగా.. బాలీవుడ్ మహారాణి దీపికా పదుకొనె 112.8 నాలుగో స్థానంలో నిలిచింది. గత మూడేళ్ళుగా దీపికా తన సంపాదనతో టాప్ ఫైవ్ లో స్థానం దక్కించుకున్నారు. గతేడాది రెండవ స్థానంలో నిలిచిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈసారి 13 స్థానంలో ఉన్నాడు. దీనికి కారణం ఈ ఏడాది పెద్దగా సినిమాలేవి విడుదల కాకపోవడమే అని అంటున్నారు. అలాగే గతేడాది 7వ స్థానంలో నిలిచిన ప్రియాంక ఈ సంవత్సరం 49వ స్థానానికి పడిపోయింది.

Also read : టీడీపీతో రాజకీయవైరాన్ని ప్రధాని వ్యక్తిగతంగా తీసుకున్నారా?

ఇక దక్షిణాది నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ 50 కోట్లు సంపాదించి 14వ స్థానంలో నిలిచాడు. సౌత్ ఇండియానుంచి చూసుకుంటే రజినీకాంత్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 31కోట్ల సంపాదించి 24వ స్థానాన్ని దక్కించుకున్నాడు. తెలుగులో మాత్రం మొదటిస్థానంలో నిలిచాడు. పవన్ తరువాత 28 కోట్లు సంపాదనతో జూనియర్ ఎన్టీఆర్‌ 28వ స్థానంలో నిలిచాడు. 24.33 కోట్లతో సూపర్ స్టార్ మహేష్ బాబు 33 స్థానంలో, 23. 67 కోట్ల సంపాదనతో 34వ స్థానం, 22.25 కోట్ల ఆదాయంతో టాలీవుడ్ కింగ్ నాగార్జున 36వ స్థానం దక్కించుకున్నారు. వీరి తరువాత దర్శకుడు కొరటాల శివ 20 కోట్ల సంపాదనతో 39వ స్థానంలో ఉండగా.. 64 , 69 స్థానాల్లో 15.67 కోట్లు సంపాదనతో అల్లుఅర్జున్, 15.17 కోట్లు సంపాదనతో నయనతార ఉన్నారు. ఇక్కడ విశేషమేమంటే సౌత్ ఇండియానుంచి ఫోర్బ్స్ లో స్థానం దక్కించుకున్న తార ‘నయనే’.. వీరి తరువాత మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ 14 కోట్లు, యువసంచలనం విజయ్‌ దేవరకొండ14 కోట్ల ఆదాయంతో 72వ స్థానంలో నిలిచారు.