‘సుబ్రహ్మణ్యపురం’ నాకు చాలా ప్రత్యేకం : ఈషా రెబ్బ

subramanya puram heroin eesharebba interview

డిసెంబర్ 7న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తుంది ‘సుబ్రహ్మణ్యపురం’ సుమంత్ ఈషా రెబ్బ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

దర్శకుడు సంతోష్ కథ చెప్పగానే:
నాకు సంతోష్ రెండు గంటలు కథ చెప్పాడు.. అతను కథ చెపుతున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను అది నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. నెక్ట్స్ ఏమవుతుంది అని టెన్సన్ పడుతూ సినిమాలు చూడటం నాకు ఇష్టం.

నా పాత్ర ఎలా ఉంటుందంటే:
ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి, తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అందులోనూ తండ్రిని ఎక్కువుగా ఇష్టపడుతుంది. ఇంకా చాలా భక్తురాలు, కానీ ఈ సినిమాలో కనిపించేంత భక్తురాలను కాదు.

సుబ్రహ్మణ్యపురం టీం లో ఒక ఎనర్జీ ఉంది:
ఈ టీంతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఆర్.కె. ప్రతాప్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ సుబ్రహ్మణ్యపురం కు పెద్ద అసెట్ గా నిలిచాయి.

షూట్ చేసినప్పడు థ్రిల్లవ్వలేదు:
షూట్ చేస్తున్నప్పుడు అంత భయం అనిపించలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఆ టోటాలిటీ వస్తుంది. అది చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది.

సుమంత్ కంప్లీట్ ఆపోజిట్ గా కనిపిస్తాడు:
నేను భక్తురాలుగా కనిపిస్తాను సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేసాడు. వారి అభిప్రాయాల మద్య ఘర్షణ ఉంటుంది.

సుమంత్ తో వర్క్ చేయడం చాలా కంపర్టబుల్:
సుమంత్ సినిమాలలో గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీరావా సినిమాలు నాకు ఇష్టం. ఆయన నటన సహాజంగా ఉంటుంది అది నాకు నచ్చుతుంది.

పని అడిగితే తప్పులేదు కదా..?:
నాకు వచ్చిన కథలలో నాకు నచ్చినవి ఎంచుకుంటున్నాను. ఒక పాత్రకు నేను ఉంటే బాగుంటుంది అనుకునే పాత్రలను చేస్తున్నాను. నాకు కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్స్ లో వర్క్ చేయాలని ఉంటుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇప్పుడు పెరుగుతున్నాయి.

సుధాకర రెడ్డి అభిరుచి గల నిర్మాత:
నిర్మాత అంటే ఓన్లీ బడ్జట్ లోనే ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటారు. కానీ సుధాకర రెడ్డి గారు సినిమా కథ చర్చలలో కూడా పాల్గోనేవారు, రోజూ షూట్ కి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే వారు.

మొదటి సినిమా దర్శకుడులా పనిచేయలేదు:
సంతోష్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. అతను బౌండ్ స్ర్కిప్ట్ తో వచ్చాడు. ప్రతి సీన్ అతను వివరించే విధానం చాలా క్లారిటీ గా ఉంటుంది. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉండేలా డిజైన్ చేసుకున్నాడు.
మొదటి సినిమా దర్శకుడిలా అనిపించలేదు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.