సన్నీలియోన్ సిస్టర్ కూడా ఆమె లాగే..

Sunny-Leone-tweet

సన్నీలియోన్ ఈ పేరు తెలియని కుర్రకారు బహుశా ఉండరేమో.. అంతలా క్రేజ్ సంపాదించుకుంది ఈ బోల్డ్ బ్యూటీ. శృంగార తారగా పాపులర్ అయిన సన్నీ.. బాలీవుడ్‌లో అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకుంది. తనకు అనువైన కథలు చేస్తూ పాపులారిటీని సంపాదించుకుంది. పోర్న్ స్టార్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ వెండితెరపై తన టాలెంట్ నిరూపించుకోవటానికి బాగా ప్రయత్నం చేస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు వడివుడయాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వీరమహాదేవి’ లో లీడ్ రోల్ పోషిస్తోంది. దాదాపు రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ చూస్తోంటే ఆమె నిజంగా సన్నీ నేనా అనేంతగా ఉంది. అంతలా ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది. ఈ మూవీతో మంచి నటిగా నిరూపించుకోవటానికి గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు లాంటివి చేసి చాలా కష్టపడుతున్నట్లు సినీ ఇండస్ట్రీ టాక్.

ఇదిలా ఉంటే ఇప్పుడు తన బాటలోనే నడుస్తోంది తన సిస్టర్ అయిన మియా రాయ్ లియోన్. సన్నీలాగా తనకు సినీరంగం అంటే చాలా ఇష్టమట. అందుకే వెండితెరపై ఎంట్రీ ఇవ్వటానికీ రెడీ అయింది.

ఏఆర్ ముఖేష్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇవనుక్కు ఎంగయో మచ్చం ఇరుక్కు’ అనే మూవీలో నటిస్తోంది మియా. మరీ సన్నీలాగే ఆమె కూడా రాకెట్‌లా దూసుకెళుతుందో లేదో చూడాలి.