జయలలిత మరణించి రెండేళ్లు..జయ బయోపిక్ ఫస్ట్‌లుక్‌ విడుదల

JAYA LALATHA

తమిళనాడు దివంగత సీఎం జయలలిత రెండో వర్థంతిని పురష్కరించుకోని చెన్నైలో భారీ శాంతి ర్యాలీని నిర్వహించారు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు . అమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అటు జయ మరణం పట్ల అనుమాలు తలెత్తడంతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ముస్వామి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు డాక్టర్ శివకుమార్ ..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి రెండేళ్లైంది. ఆమె వర్థంతిని పురష్కరించుకుని అన్నాడీంకే నేతలు, కార్యకర్తలు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం నేతఈత్వంలో చెన్నైలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అమ్మకు నివాళుల్పించేందుకు నలుపు ,తెలుపు దుస్తులు ధరించి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు చెన్నైకి తరలివచ్చారు.

పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య అన్నా సలై నుంచి మెరీనా బీచ్‌లోని జయలలిత మెమోరియల్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం ఆమె సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. తీవ్ర అస్వస్థత కారణంగా 2016 సెప్టెంబర్ 22న చెన్నైలోని అపొల్లో ఆస్పత్రిలో చేరిన జయలలిత.. 75 రోజుల చికిత్స అనంతరం డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచారు..

చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో జయకు చికిత్స అందించగా.. ఆమె మరణం పట్ల ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయంటున్నారు పలువురు అన్నాడీఎంకే నేతలు. అమ్మను చూశామని మేం అబద్ధం చెప్పాం. కానీ ఎవరూ ఆమెను కలవలేదని జయ మరణించిన 9 నెలల తర్వాత తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలు జయ మరణం పట్ల అనుమానాలను మరింత పెంచాయి.

జయ మరణం పట్ల అనుమానాలు తలెత్తడంతో తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందుకు జయ చికిత్సను పర్యవేక్షించిన డాక్టర్ శివకుమార్ జస్టిస్ ఆర్ముగస్వామి ముందు హాజరైయ్యారు. జయలలిత స్పృహలోకి వచ్చి మాట్లాడితే.. ఆమెకు. సర్జరీ చేయాలని ఎందుకు అనుకోలేదని శివకుమార్‌ను ప్రశ్నించారు జస్టిస్.. యాంజియోగ్రామ్ ఎందుకు చేయలేదన్నారు. డాక్టర్ చెరియన్, డాక్టర్ బ్రహ్మానందం యాంజియోగ్రామ్‌ పట్ల విముఖత వ్యక్తం చేశారని శివకుమార్ చెప్పినట్లు సమాచారం. జయ ఆరోగ్యం మెరుగుపడటానికి అవసరమైన చికిత్సను డాక్టర్లు అందించినట్లు తెలిపారు శివకుమార్ ..

మరో వైపు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ఫస్ట్‌లుక్‌ను ది ఐరన్ లేడి అనే టైటిల్‌తో చిత్రబృందం విడుదల చేసింది. పేపర్ టేల్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రియదర్శిని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది. జయలలిత వర్థంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో నుదుటన పెద్ద బొట్టు, చీరకట్టుతో అచ్చం జయలలితలాఆకట్టుకుంటోంది నిత్యామీనన్ .