విజయ్.. మీ కోసం ఎన్ని రోజులైనా..

విజయ్ దేవరకొండ ఇంటి పేరుతో పాపులరయ్యాడు. యువ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్నాడు. కాలేజీ స్టూడెంట్స్ తరగతులకు బంక్ కొట్టి మరీ మొదటి రోజే తన సినిమాలు చూసేంత క్రేజ్ సంపాదించుకున్నాడు. యువ తరంతో పాటు నాటి తరం కూడా విజయ్ సినిమాలంటే ఆసక్తి చూపిస్తుంటారు.

హిట్ చిత్రాల కథానాయకుడిగా కాకుండా పక్కింటి కుర్రాడిలా ఈజీగా యాక్ట్ చేస్తుంటాడు. అందుకే అతి కొద్ది కాలంలోనే అంత పేరు వచ్చింది. ఫోర్బ్స్ జాబితాలో పేరు నమోదయ్యేంతగా సంపాదన కూడా పెరిగింది. తాజాగా వచ్చిన టాక్సీవాలా కూడా సక్సెస్‌ అవడంతో విజయ్ దేవరకొండ కోసం దర్శకులు క్యూ కట్టేస్తున్నారు.

డియర్ క్రామెడ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా. దాని తరువాత మరో రెండు సినిమాలు చేయాల్సి ఉంది. మరో నాలుగు సినిమాలకు మాట ఇచ్చారు. అందుకే విజయ్ డైరీ దాదాపుగా ఫుల్లుగా ఉంది. అయినా విజయ్.. నీకోసం మేము వెయిట్ చేస్తామంటున్నారు దర్శకులు పూరీ జగన్నాథ్, మారుతి, గోపీచంద్ మలినేని.

పూరీ కథను విజయ్‌కి వినిపిస్తే, మారుతి మాత్రం రెండు, మూడు కథలు సిద్ధం చేసుకున్నాడట. హీరోకి ఏది నచ్చితే అది ఓకే చేయాలనుకుంటున్నారు. ఇక గోపీచంద్ మలినేని కూడా తన కథకు మెరుగులుదిద్దుతున్నారు విజయ్ చేత ఎలా అయినే ఒప్పించాలనే ఉద్దేశ్యంతో. మొత్తానికి విజయ్ దేవరకొండ ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ అంటున్నారు ఈ ముగ్గురు దర్శకులు.