ట్విట్టర్‌లో టాప్ విరుష్క జంటే..

పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. నూతన సంవత్సరానికి వెల్‌కమ్ పలకటానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలిఉన్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న ఈ తరుణంలో ఈ ఏడాది సోషల్ మీడియాలో ట్విట్టర్‌ వేదికగా ట్రెండ్ అయిన వాటిని రిలీజ్ చేసింది ‘ట్విట్టర్ ఇండియా2018’.

నెటిజన్లు దేనికి ఎక్కువ రెస్పాండ్ అయ్యారు.. దేని గురించి ఎక్కువగా డిస్కషన్ చేశారు.. దేనికి ఎక్కువ లైక్ లు వచ్చాయి.. ఇలాంటి ఓ లిస్ట్‌ని ట్విట్టర్ ఇండియా రిలీజ్ చేసింది. ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది ‘విరుష్క’ జంట. ఈ ఏడాది ‘విరుష్క’ ఫోటోకి నెటిజన్లు ఎక్కువగా లైక్‌లు చేశారు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ మ్యారేజీ సెలబ్రేషన్స్‌ నేపథ్యంలో దిగిన ఈ ఫోటోకు 2 లక్షల 15వేల లైక్స్ వచ్చాయి. వెన్నెల వెలుగులో సంప్రాదాయ దుస్తులు ధరించి ఉన్న ఫోటోను విరుష్క జంట అక్టోబర్‌ నెలలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే నెటిజన్లు ఈ ఫోటోకి ఫిదా అయిపోయి తెగ లైకులు కొట్టారు. సో.. ఈ ఇయర్‌లో అత్యధిక లైకులు కొట్టిన ఫోటో‌గా 2018 మిగిలిపోతుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.