షాకింగ్.. మోత్కుపల్లి నర్సింహులుకి తీవ్ర అస్వస్థత

బీఎల్‌ఎఫ్‌ అభ్యర్ధి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటినా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా మోత్కుపల్లి పోటీ చేస్తున్నారు.