బద్దకం వీడి..ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి

తెలంగాణలో బిగ్‌డే. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. సగానికి పైగా ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఉదయం మెల్లగా ప్రారంభమైన ఓటింగ్.. సమయం గడిచేకొద్దీ ఊపందుకుంది. ఒకటిరెండు చోట్ల ఈవీఎంలు మొరాయించినా.. ఎన్నికల సిబ్బంది వాటిని మార్చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు ఓటు వేసి.. ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు బద్దకం వీడి.. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.