తెలంగాణ పోలింగ్‌.. క్యూ లైన్‌లో ప్రముఖులు..

సిద్దిపేటలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి హరీష్ రావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారన్నారు. కష్టం అనుకోకుండా ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని సూచిస్తున్న హరీష్‌రావు.
————————-
సూర్యాపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి జగదీష్‌ రెడ్డి ఓటు వేశారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే జగదీష్ రెడ్డి సతమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
————————-
అంబర్ పేటలో బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సమాజ హితం కోసం అందరు ఓటు వేయాలని కోరారు. మంచి అభ్యర్ధిని ఎన్నుకోవాలన్నారు కిషన్‌రెడ్డి.
————————-
కూకట్‌పల్లి మహాకూటమి అభ్యర్ధి నందమూరి సుహాసిని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాంపల్లిలో పోలింగ్‌ కేంద్రంలో సుహాసిని ఓటేశారు.
————————-
ఓటు వేసేందుకు వచ్చే వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఈసీ… ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద వీల్‌ చైర్లను అందుబాటులో ఉంచారు..
————————-
హైద్రాబాద్ సీపీ అంజన్ కుమార్ ఓటు వేశారు. కుందన్‌భాగ్‌ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రేటర్‌లో ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
————————-
ఓటు హక్కు వినియోగించుకేనేందుకు సాధారణ ప్రజానికంతో పాటు ప్రముఖులు తరలిస్తున్నారు. జూబ్లీహీల్స్‌లో నటుడు నాగార్జున దంపతులు ఓటు వేశారు.
————————-
జూబ్లీహిల్స్‌లో నటుడు అల్లు అర్జున్ ఓటు వేశారు. ఓటర్ల క్యూ లైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
————————-
పోలింగ్ కేంద్రాల వద్ద ఈసీ పలు నిషేదాజ్ఞాలు విధించింది. బూత్‌లోకి సెల్‌ ఫోన్స్‌కు అనుమతి నిరాకరించారు. అలాగే మద్య సేవించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం నిషేదించారు. కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.
————————-
కొన్ని చోట్ల పోలింగ్‌కు ఆటంకం ఏర్పడింది. ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ స్టార్ట్ అయింది. కూకట్‌పల్లి,శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పల్లు జిల్లాల్లో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అంతరాయం కలిగింది.
————————-