తెలంగాణలో సా.. 5 గంటల వరకు 67శాతం పోలింగ్ : సీఈఓ రజత్ కుమార్

ceo rajathkuamr talk to media after poling

తెలంగాణలో పోలింగ్ అనంతరం ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్ మాట్లాడారు.. సాయంత్రం 5 గంటల వరకు 67శాతం పోలింగ్ జరిగిందని చెప్పారు. 754 బ్యాలెట్ యూనిట్లు.. 628 కంట్రోల్ యూనిట్ల ఏర్పాటు చేశామని చెప్పారు. 1444 వీవీ ప్యాడ్ యంత్రాలు మార్చామని.. రజత్ కుమార్ వెల్లడించారు. మొత్తం 4292 ఫిర్యాదుల్లో 642 పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం రూ. 117.2 కోట్ల నగదు సీజ్ చేశామని.. అలాగే 138 కోట్ల విలువైన సొత్తు స్వాథీనం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. రూ.11.6 కోట్ల విలువైన 5.4 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నాం.. గల్లంతయిన ఓట్లపై జాబితా సవరణలో ప్రత్యేక దృష్టిసారించామని అన్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల పేరు 2015 లో జాబితా నుంచి గల్లంతైంది. 2014 రూ. 76 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని రజత్ కుమార్ వెల్లడించారు.