ప్రతి పేద వారికి పది వేల రూపాయలు.. : చంద్రబాబు

cm chandrababunaidu talk about two digit growth

ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్రం సహకరించకపోయినా సొంతంగానే సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. టీడీపీకి బీసీలే వెన్నెముక అన్న ఆయన, బీసీ వర్గాలకు అండగా ఉంటామని పునురుద్ఘాటించారు. ప్రతి పేద వాడికి కనీసం పది వేల రూపాయల ఆదాయం వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు చంద్రబాబు.

రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబునాయుడు. ప్రణాళికాబద్దంగా పని చేసి, రెండంకెల వృద్ధి సాధించామన్నారు. తిరుపతిలో నిర్వ హించిన పేదరింకపై గెలుపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 10 వేల 138 మంది లబ్ది దారులకు పనిముట్లు, నిధులు పంపిణీ చేశారు.

అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, పించన్ పథకాలతో పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటోందని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అన్న ఆయన, బీసీ
వర్గాలకు అండగా ఉంటామని పునురుద్ఘాటించారు. చేతివృత్తులవారికి నాణ్యమైన పనిముట్లు ఇస్తామన్న బాబు, కొత్త గోకులాలను తీసుకొచ్చామని వివరించారు. రాయలసీమలో హంద్రీనీవా నీళ్లు పారించే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ కేవలం మాటల ప్రధానిగా, ఎన్నికల ప్రధానిగా మారిపోయారని మండిపడ్డారు చందబ్రాబు . ఆయన వల్ల నవ్యాంధ్రకు ఒరిగిందేమీ లేదు అని విమర్శించారు. . అలాగని కేంద్రంపై నెపం పెట్టి మౌనంగా ఉండిపోలేదని.. సొంతంగా రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. దీని ఫలితంగా నాలుగున్నరేళ్లలో గ్రామాల పరిస్థితిలో ఎంతో మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు బాబు.

సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ కలయికతో ప్రభుత్వం ముందుకు పోతుంద‌న్నారు.. ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిరుద్యోగ యువతకు భృతి చెల్లిస్తూనే.. నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ప్రతి పేద వాడికి కనీసం పది వేల రూపాయల ఆదాయం మా లక్ష్యమని స్పష్టం చేశారు చంద్రబాబు.