జక్కన్నా.. నీ ఓటు ఎవరికన్నా..

భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి ఓ సినిమాకి స్కెచ్ గీసాడంటే దానిపై అభిమానులకు కూడా భారీ అంచనాలే ఉంటాయి. కథలో కథనంలో కొత్తదనం కోసం పరితపిస్తారు. విజువల్ గ్రాఫిక్స్‌‌తో మాయ చేస్తారు. పనిని ప్రాణంగా ప్రేమించి ప్రేక్షకుల నుంచి మార్కులు కొట్టేస్తాడు. బాహుబలి 2 తరువాత అతడి నుంచి వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

RRR మూవీ ఫస్ట్ షెడ్యూల్ ముగించుకుని తెలంగాణలో జరుగుతున్న ఓటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు రాజన్న. మీ అందరితో పాటు నేను కూడా ఓటు వేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు.

మన భవిష్యత్తుని నిర్మించుకోవడం కోసం ఓటు వేయడం మరచిపోకండి అంటూ అభిమానులతో పాటు అందరికీ పిలుపునిచ్చారు. ఇంతకీ మీ ఓటు ఎవరికి వేస్తున్నారంటూ.. నెటిజన్స్ ట్వీట్లు పెడుతున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా మెలిగారు. అక్కినేని పురస్కార ప్రధానం సమయంలో ట్రెండ్ సెట్టర్ అంటూ టీఆర్ఎస్ అధినేత నుంచి పొగడ్తలందుకున్నారు. మరి ఓటు ఎవరికంటే మాట దాటేస్తున్నారు.