కొడుక్కి ఓటు హక్కు వచ్చినందుకు హీరో ఆనందం..

మొదటి సారి కొడుక్కి కూడా ఓటు హక్కు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు హీరో శ్రీకాంత్. భార్య ఊహ, కొడుకు రోషన్‌తో కలిసి వచ్చి ఓటు వేశారు. జుబ్లీహిల్స్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయడం తమ బాధ్యతగా భావించాలన్నారు. ఎలక్షన్ కమిషన్ అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి పోలింగ్ శాతాన్ని పెంచిందని, పౌరులందరూ ఓటు వేసేలా పలు చర్యలు తీసుకున్నందుకు అభినందించారు.