బయటపడ్డ పోలింగ్ సిబ్బంది నిర్వాకం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పోలింగ్‌ సిబ్బంది నిర్వాకం బయటపడింది. లంచ్‌ బ్రేక్ అంటూ సిబ్బంది పోలింగ్ బూత్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ఆ సమయంలో ఓట్లు వేయడానికి వచ్చిన చాలామంది సిబ్బంది కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. తాళం వేసి ఉన్న బూత్‌కు ఫోటో తీసి కొందరు వాట్సప్‌లో షేర్‌ చేయడంతో.. సిబ్బంది నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓటు వేయడానికి లైన్లో ఉన్నా తమను పట్టించుకోకుండా బూత్‌కు తాళం వేయడంపై ఓటర్లు మండిపడుతున్నారు..