జూ.ఎన్టీఆర్ అమ్మని, భార్యని లైన్లో నిలబెట్టి..

ఎలక్షన్ల రోజు అందరికీ సెలవు. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే సినిమా స్టార్లు ఈరోజు ఓటు వేయడానికి లైన్లో నిలబడ్డారు. తమ అభిమాన స్టార్ హీరో వస్తున్నాడంటే ఎంత హడావిడి. స్క్రీన్ మీద చూసినా కళ్ల ముందు ప్రత్యక్షమైతే అభిమానులు ఆనందానికి అవధుల్లుండవు.

ఎన్నికల రోజు మాత్రం ఓటు వేయడానికి వచ్చిన సినిమా యాక్టర్లని తమ పని తాము చేసుకోనిచ్చారు అభిమానులు. సామాన్యులతో పాటు సమానంగా లైన్లో నిలబడి ఓటు వేస్తున్నందుకు ముచ్చటపడ్డారు. ఓటు వేయడం కోసం అరవింద సమేతుడు అమ్మని కూడా తీసుకుని వచ్చి లైన్లో నిలబడ్డాడు. ఓటు హక్కుని అమ్మ, భార్యతో సహా వినియోగించుకుంటున్నాడు.