కవచం రివ్యూ

విడుదల తేదీ: డిసెంబర్ 07, 2018

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్,కాజల్ అగర్వాల్,మెహ్రిన్

దర్శకత్వం : శ్రీనివాస్ మామిళ్ళ

నిర్మాత : నవీన్ చౌదరి శొంఠినేని

సంగీతం : ఎస్ ఎస్ థమన్

సినిమాటోగ్రఫర్ : చోటా కె నాయుడు

ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్

స్క్రీన్ ప్లే : శ్రీనివాస్ మామిళ్ల

మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తన ప్రతి చిత్రంలో ఆ ఎలిమెంట్స్ ని మిస్ అవకుండా కథలను ఎంచుకుంటున్నాడు. కవచం ను యాక్షన్ థ్రిల్లర్ గా మలచి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కవచంలో ని థ్రిల్లింగ్ పాయింట్స్ ఎంటో చూద్దాం..

కథ : విజయ్ ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. తన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యకు చట్టం ప్రకారం న్యాయం చేస్తుంటాడు. ఒకరోజు సంయుక్త (మెహ్రిన్) అనే అమ్మాయి కి తన ప్రేమ వ్యవహారం లో సహాయం చేస్తాడు. సంయుక్త కాడ్నాప్ అయ్యిందనే వార్తను టివి లో చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయి సంయుక్త (కాజల్) అని తెలుస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి సంయుక్త అయితే, మరి తనుసహాయం చేసిన అమ్మాయి ఎవరు..? తనను కిడ్నాపర్ గా చిత్రీకరించిన దెవరు..? పోలీస్ డిపార్ట్ మెంట్ కు దూరం అయిన విజయ్ తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడు..? తను ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగిలిన కథ..?

కథనం:
బెల్లకొండ శ్రీనివాస్ గత చిత్రాలతో సొంత చేసుకున్న ఇమేజ్ ను పెంచే విధంగా కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్. హీరో పర్సనాలిటీ కి తగ్గ పాత్ర దొరకడంతో శ్రీనివాస్ చెలరేగిపోయాడు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ని గ్రాండ్ గా ప్రజెంట్ చేసిన తర్వాత కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ గా తన నటనతో ఆకట్టుకున్నాడు. పోసాని అండ్ గ్యాంగ్ చేసిన పోలీస్ కామెడీ పర్వాలేదనిపించింది. పోలీస్ సూపర్ మాన్ గా చూపించకుండా చాలా రియలిస్టిక్ అప్రోచ్ తోనే దర్శకుడు వెళ్ళాడు. ఇక హీరో చుట్టు ఒక ఉచ్చు బిగుసుకున్నది అని తెలిసిన తర్వాత కథ చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది. హీరో చుట్టూ అల్లుకున్న సమస్యలకు కారణం ఎవరు అనే విషయం కంటే ఆ సమస్యలను సృష్టించిన తీరు బాగుంది. మెహ్రిన్ రెగ్యులర్ హీరోయిన్ పాత్రల నుండి బయటకు వచ్చి కథను మలుపు తిప్పే పాత్రలలో మెప్పిస్తుంది. కవచంలో సర్ ప్రైజింగ్ రోల్ మెహ్రిన్ దే అనడంలో సందేహం లేదు. ఫైట్స్ లో శ్రీనివాస్ మరింత దూకుడు చూపించాడు. కవచం లో ఫైట్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించే సత్తా ను చూపించాడు శ్రీనివాస్. సెకండాఫ్ లో వచ్చిన ప్రేమకథ గ్రిప్పింగ్ సాగుతున్న కథనంకు బ్రేక్ లు వేసింది. నెక్ట్స్ ఏమవుతుంది..? హీరో ఈ సమస్యనుండి ఎలా బయటపడతాడు అనే బిగి సడలకుండా కథనం నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మోహ్రిన్ తో పాట కథకు అనవసరం అనిపించింది. హీరో పాయింట్ నుండి విలన్ ఎవరో తెలుసుకోవడానికి అతను చేసే యుద్దం ఆసక్తిగా మలిచిన దర్శకుడు ప్రేమకథను సరిగా డీల్ చేయలేకపోయాడు. హీరో సాయిశ్రీనివాస్ పాటలు, ఫైట్స్ లో చురుగ్గా ఉన్నాడు. కాజల్ సంయుక్త పాత్రకు న్యాయం చేసింది. తన గ్లామర్ స్టార్ వాల్యూ తప్పకుండా ఈ కథకు అడ్వాంటేజ్ గా మారింది. దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే కథకు అడ్డంకి గా మారింది. స్ట్రయిట్ గా చెప్పినా బాగుండే ప్రేమకథకు ముక్కలు ముక్కలు చేసి థ్రిల్లర్ టెంపోని తగ్గించాడు. శ్రీనివాస్ యాక్షన్ ఈ సినిమాను మాస్ ఆడియన్స్ కి దగ్గర చేస్తుంది. ముఖేష్ రుషి, అజయ్, నీల్ నితిన్ ముఖేష్ లు పాత్రలకు న్యాయం చేసారు. థమన్ పాటలు పర్వాలేదనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకుబలం చేకూర్చింది.

చివరిగా:
యాక్షన్ పోలీస్ ఫర్ మాస్ ఆడియన్స్